తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం

శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసేలా చూడాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్‌ ఉత్పతి వల్ల నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో ఏపీ ఈఎన్‌సీ పేర్కొన్నారు. చెన్నైకి కూడా తాగునీటిని సరఫరా చేయలేమని తెలిపారు. విద్యుత్‌ ఉత్పాదనతో వస్తున్న నీటిని సాగర్‌లో నిలపలేమని ఈఎన్‌సీ పేర్కొన్నారు. సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని, విద్యుత్‌ ఉత్పాదనలో కిందికి విడిచిపెట్టిన నీటిని తెలంగాణ కోటానుంచి మినహాయించాలని ఏపీ లేఖలో పేర్కొంది.