వనస్థలిపురం బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పత్రాలను అందించిన మేయర్

వనస్థలిపురం పద్మావతి కాలనిలో ఇటీవల జరిగిన సంఘటనలో మరణించిన ఇద్దరు ప్రయివేటు కార్మికులకు కుటుంబ సభ్యులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసిన ధ్రువ పత్రాలను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే డి. సుధీర్ రెడ్డి లు నేడు అందచేశారు. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ లో పూడిక పనులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళలో కాంట్రాక్టర్ తీయిస్తుండగా మరణించిన శివ కుమార్ భార్య ధరణి శ్రావణ గౌరీ, అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మ లకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పత్రాలను మేయర్ కార్యాలయంలో అందించారు. వనస్థలిపురం రైతు బాజార్ జై భవాని నగర్ కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లలో 702 నెంబర్ ఇంటిని శ్రావణ గౌరీ కి, 701 నెంబర్ ఇంటిని భాగ్యమ్మ లకు కేటాయించారు. ఇప్పటికే వీరికి ఒక్కొక్కరికి రూ. 17 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.