ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు

ఆస్తి కోసం హత్యలు చేయడం ఈరోజుల్లో కామన్ అయ్యింది. ఆస్తి కోసం కన్నా తల్లిదండ్రులను సైతం చంపడానికి వెనుకడుగు వెయ్యడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇదే జరిగింది. ఆస్తి ఫై కన్నేసిన కోడలు..అత్తను చంపేసింది. సూర్యాపేట మండలంలోని కుసుమవారిగూడేనికి చెందిన వీరారెడ్డి, లలితమ్మ దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. వీరారెడ్డి చనిపోవడం తో భూమిని తన భర్త పేరు మీద రాయాలని కోడలు విజయలక్ష్మి అత్త లలితమ్మతో గొడవపడేది. మామ మరణానంతరం ఆమె వద్ద ఉన్న డబ్బులు కూడా కూతుళ్లకే ఇచ్చిందని.. భూమిపై వచ్చే పంట డబ్బులు కూడా బిడ్డలకే పెడుతోందని కోడలు రగిలిపోయింది.

అత్తని అడ్డు తప్పిస్తే కానీ ఆస్తి తన చేతికి రాదని భావించి కన్నింగ్ ప్లాన్ సిద్ధం చేసింది. మూడేళ్లుగా తమ వద్ద పనికి వస్తున్న పని అతడితో ప్లాన్ చేసి అత్తను చంపేసింది. పోలిసుల విచారణలో కోడలే ఈ హత్య చేయించిందని తేలడం తో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.