ఆత్మహత్య చేసుకున్న రైతు సంపత్ రెడ్డి కుటుంబాన్నిపరామర్శించిన కాంగ్రెస్ నేత

కరీంనగర్ జిల్లా జమ్మికుంటా మండలంలోని మాచనపల్లి గ్రామంలో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు శీలం సంపత్ రెడ్డి కుటుంబాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరామర్శించారు.

సంపత్ రెడ్డి కి చెందిన స్వంత సాగు భునిని అధికార పార్టీ కి చెందిన సర్పంచ్ ఇంటికి తోవ కోసం బలవంతంగా లాక్కుంటున్నారు. అడ్డుకున్న సంపత్ రెడ్డి ఆయన భార్య రమాదేవి మీద సర్పంచ్ భర్త తిరుపతి రెడ్డి ఆయన అనుచరులు దాడి చేసి చితకబాదారు. గత కొన్ని రోజులుగా సంపత్ రెడ్డి ని మానసికంగా శారీరకంగా వేదించబట్టే నిన్న సంపత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తోవ కవలనుకొంటే కొనుక్కోవాలి కానీ దౌర్జన్యంగా లాక్కోవడం ఏంటి.?

అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన సమస్య పరిష్కరం చేయలేరు. సంపత్ రెడ్డి ఆత్మహత్య కు కారణం అయిన14 మంది మీద కేసు పెట్టి ఇప్పటికి వారిని అరెస్టు చేయలేదు. సంపత్ రెడ్డి ఆత్మహత్య కు కారణం అయిన గ్రామ సర్పంచ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. రైతు మరణానికి కారణం అయిన సర్పంచ్ ఆమె భర్తను టి ఆర్ యస్ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.