GSLV-F10 రాకెట్ ప్రయోగం ఫెయిల్

శ్రీహరికోట నుంచి మంగళవారం ఉదయం ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయ్యింది. రెండు స్టేజీల వరకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్లో క్రయోజనిక్ మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తడం తో ప్రయోగం ఫెయిల్ అయ్యింది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైవ్‌సోర్స్‌ను నిలిపి వేశారు. జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.ఈ ప్రయోగం వల్ల ఇస్రో కు 1500 కోట్లు నష్టం వాటిల్లింది.