వాక్సిన్ తీసుకుంటే కరోనా రాదని చాలామంది అనుకుంటున్నారు కానీ అది తప్పు. వాక్సిన్ తీసుకున్న కానీ కరోనా జాగ్రత్తలు పాటించకపోతే కరోనా బారినపడడం ఖాయం. తాజాగా కేరళలో కరోనా వేరియంట్లు దడ పుట్టిస్తున్నాయి. రెండు డోసులు వేసుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే 40 వేల మంది కరోనా బారినపడినట్లు తేలింది. ఆ 40వేల మంది కొవిడ్ శాంపిళ్లను సేకరించి, జన్యుక్రమాల విశ్లేషణ (జీనోమిక్ సీక్వెన్సింగ్) కు పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే కేరళలో ఏ వేరియంట్ వ్యాపిస్తోంది? అది కొత్త వేరియంటేనా? అనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తోంది.