బూట్లు పాలిష్ చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలు

బీజేవైఎం విన్నూత్న నిరసన చేపట్టింది. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు బూట్ పాలిష్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా నిరసన చేపట్టారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. అంతేకాకుండా నిరుద్యోగులకు చెల్లించాల్సిన 33నెలల నిరుద్యోగ భృతి చెల్లించాలంటోన్న బీజేవైఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బూట్ పాలిష్, రోడ్లు ఊడుస్తూ బీజేవైఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.