తెలంగాణ రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కోవిడ్ వల్ల అనాథలు అయిన వారి స్థితిగతులు ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి అధ్యక్షతన కాబినెట్ సమావేశం జరిగింది.
ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి అనాథల సంరక్షణ, సంక్షేమం, భవిష్యత్ బాధ్యతలు తీసుకునేందుకు దేశంలోనే అత్యుత్తమమైన, ఆదర్శవంతమైన విధానాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందించాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.