రైతులకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) పథకం లో భాగం గా అందించే ఆర్థిక సహాయం తాలూకు తరువాతి కిస్తీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాబోయే సోమవారం నాడు అంటే 2021వ సంవత్సరం ఆగస్టు 9 న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు. దీని తో 9.75 కోట్ల కు పైచిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల సొమ్ము బదలాయింపున కు మార్గం సుగమం అవుతుంది. ఈ కార్యక్రమం లో రైతు లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడనుండడమే కాకుండా దేశ ప్రజల ను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు.

పిఎమ్-కిసాన్ ను గురించి

పిఎమ్-కిసాన్ పథకం లో భాగం గా, అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాల కు ప్రతి సంవత్సరమూ 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని, ఒక్కొక్క సారీ 2,000 రూపాయల వంతు న, మూడు సమాన కిస్తీల లో- ప్రతి 4 నెలల కు ఒక కిస్తీ పద్ధతి లో- చెల్లించడం జరుగుతున్నది. ఈ నిధి ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల లో నేరు గా బదలాయిస్తూ వస్తారు. ఈ పథకం లో, ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్ల రూపాయల సమ్మాన రాశి ని రైతు కుటుంబాల కు బదలాయించడమైంది.