కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంఛానంగా ప్రారంభించారు.
రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని 6 వేల కోట్లతో ప్రారంభించామని మంత్రి తెలిపారు .రాష్ట్రంలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో6వేల కోట్ల 70 లక్షలతో మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని తెలిపారు.మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం లో 80 లక్షలు గొర్రెల యూనిట్లను గొల్లకుర్మలకు పంపిణీ చేశామని తెలిపారు.వాటి ద్వారా కోటి 30 లక్షల గొర్రె పిల్లలు ఉత్పత్తి అయ్యాయని అన్నారు. రాష్ట్రంలోని గొల్ల కురుమ లందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకె గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈ సందర్భంగా తెలిపారు.