కోవిడ్-19 కారణంగా ఉత్పన్న మౌతున్న ఆరోగ్య సమస్యల పరిష్కారం తో సహా వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తోంది.
కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్-19 వ్యాప్తి చెందుతూ ఉండడంతో, ఈ క్రింది చర్యలు చేపట్టడం జరిగింది:
- పట్టణాల సమీపంలోని ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్-19 నియంత్రణ, యాజమాన్యం పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, 2021 ఏప్రిల్ 16వ తేదీన వివరణాత్మక ఎస్.ఓ.పి. ని విడుదల చేసింది. సమాజ-ఆధారిత సంస్థలు, గ్రామీణ ఆరోగ్య, పారిశుధ్య, పౌష్టికాహార కమిటీలు (వి.హెచ్.ఎస్.ఎన్.సి), పచాయతి రాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు మొదలైన వాటిని పరస్పరం భాగస్వామ్యం చేయడం ద్వారా, ఇతర ముఖ్యమైన ఆరోగ్య సేవలను అందించడం కొనసాగించడంతో పాటు, పట్టణాలకు సమీపంలోని ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రతిస్పందనను తీవ్రతరం చేయడానికి అన్ని స్థాయిలలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఎస్.ఓ.పి. సహాయపడుతుంది.
- రూ .15 వేల Cr యొక్క ‘ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య విధానం సంసిద్ధత ప్యాకేజీ’ కింద 2020 ఏప్రిల్ నెలలో 15,000 కోట్ల రూపాయల మేర నిధులు ఆమోదించడం జరిగింది. ఈ నిధుల నుండి కోవిడ్-19 ప్రజా ఆరోగ్య సవాళ్ళ నిర్వహణ కోసం వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు అందించడం జరిగింది.
- ఇది ప్రధానంగా నిఘా మరియు నియంత్రణ కోసం క్లిష్టమైన కార్యకలాపాలకు, పరీక్ష మరియు చికిత్స సదుపాయాలను పెంచడానికి, అవసరమైన సామాగ్రిని సేకరించడానికి, క్లిష్టమైన హెచ్.ఆర్. మొదలైన వాటి కోసం రాష్ట్రాలకు సహాయ పడుతుంది.
- రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుండి అభ్యర్థనలను స్వీకరించిన తరువాత, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్-19 నిర్వహణ కోసం గత ఏడాది విడుదల చేసిన నిధుల నుండి ఎన్.హెచ్.ఎం. కింద ఖర్చు చేయని 2021-22 ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నిల్వను ఉపయోగించుకోవడానికి అనుమతించడం జరిగింది.
- అదనంగా, ‘ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య విధాన సంసిద్ధత ప్యాకేజీ: 2వ దశ’ ను కూడా, మంత్రిమండలి 23,123 కోట్ల రూపాయల తో ఆమోదించింది. (ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 15,000 కోట్ల రూపాయలు మరియు రాష్ట్రాల వాటా 8,123 కోట్ల రూపాయలు). దీనిని 2021 జూలై, 1వ తేదీ నుండి 2022 మార్చి, 31వ తేదీ వరకు అమలు చేయడం జరుగుతుంది.
- గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలతో సహా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడానికి రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో, అదేవిధంగా, జిల్లా, ఉప జిల్లా స్థాయిలలో (శిశు వైద్య సంరక్షణ తో సహా) ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, మందులు మరియు వ్యాధి నిర్ధారణ లను సమకూర్చడానికి ఈ ప్యాకేజీ మద్దతునిస్తుంది. అదేవిధంగా, భవిష్యత్ అవసరాలకు తగిన ఔషధాల నిల్వలు నిర్వహించడం కోసం, ఆసుపత్రి యాజమాన్య సమాచార వ్యవస్థ అమలు, అన్ని జిల్లాల్లో టెలి-సంప్రదింపులకు తగిన సౌకర్యాలు విస్తరించడంతో పాటు, కోవిడ్-19 నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలలో సామర్ధ్యాన్ని పెంపొందించడం, తగిన శిక్షణ ఇవ్వడం వంటి ఐ.టి. జోక్యాలకు కూడా, ఈ ప్యాకేజీ మద్దతునిస్తుంది.
కరపత్రాలు, పోస్టర్లు, ఆడియో మరియు దృశ్య,శ్రవణ లఘు చిత్రాలు వంటి, సమాచార, ప్రచార సామాగ్రి, టూల్-కిట్లు అభివృద్ధి చేసి, స్థానిక భాషల్లోకి అనువదించడం కోసం, వాటిని రాష్ట్రాలకు అందించడం జరిగింది. మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల గురించి, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా తో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా, స్థానిక సమాజానికి వివరించడం జరిగింది. మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక అధికారులు దూరదర్శన్ / టీవీ ఛానెళ్ల లో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. కోవిడ్-19 పై సమాచారం కోసం అంకితమైన కాల్-సెంటర్ / హెల్ప్-లైన్ (1075) సమాజానికి ఎంతో సహాయం చేస్తోంది.
అదనంగా, కోవిడ్ సంబంధిత సందేశాలను స్వీకరించి, విస్తరించడానికి వీలుగా, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ, స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వంటి అన్ని ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల మద్దతు కూడా తీసుకోవడం జరుగుతుంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు ఇక్కడ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానం లో ఈ విషయాన్ని పొందుపరిచారు.