గౌరవంతో ఎంట్రీ ఇస్తున్నాడు అల్లు శిరీష్. ఇది కులం, వర్గం.. తదితర అంశాలపై సాగే సీరియస్ సబ్జెక్ట్. ఈసారి మాత్రం యూత్ ఫుల్ కథనే ఎంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే… రెండో సినిమా కోసం మారుతి జట్టు కట్టాడు. మారుతి-శిరీష్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దాని పేరు… కొత్త జంట. ఈ సినిమాలో శిరీష్ తో రొమాన్స్ చేయడానికి రెజీనాను ఎంచుకొన్నారు. రొటీన్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా… తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ తో ఓ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు నారా రోహిత్ సినిమాలో నటిస్తోంది. ఈలోగా శిరీష్ సినిమా తలుపు తట్టింది. త్వరలోనే శిరీష్, రెజీనాల రొమాన్స్ చూడొచ్చన్నమాట.