చైనా లో మరో వైరస్ పుట్టింది..ఇది వచ్చిన వారంలోనే మనిషి ఖాతం..

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి..ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు లక్షల మంది మరణించారు. ఇప్పటికే రెండు వేరియంటెడ్ లనుచూపించిన మహమ్మారి..త్వరలో మూడో వేవ్ చూపించబోతుందని అంటున్నారు. ఇదిలా ఉంటె ఇప్పుడు చైనా లో మరో వైరస్ పుట్టుకొచ్చింది. కోతుల నుంచి సంక్ర‌మించే మంకీ బీ వైర‌స్ మాన‌వుల్లో తొలికేసు న‌మోద‌యింది.

తొలికేసు న‌మోదైన కొన్ని రోజుల్లోనే ఆ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్టు చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతానికి ఒక్క‌కేసు మాత్ర‌మే న‌మోదైన‌ట్టు చైనా సీడీసీ ప్ర‌క‌టించింది. మంకీబీ సోకిన వ్య‌క్తి నుంచి మ‌రోక‌రికి ఈ వైర‌స్ సోక‌లేదని చైనా సర్కార్ చెప్పుకొచ్చింది. జంతువుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపే ఓ ప‌శువైద్యుడికి తొలిగా ఈ వైర‌స్ సోకింది.