కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యాన్ని ప్రస్తుతం వున్న 17 శాతం నుంచి 28 శాతానికి పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్- న్యూఢిల్లీలో ఈ విషయం వెల్లడిస్తూ – 2020 జనవరి 1, 2020 జూలై 1, 2021 జనవరి 1 నుంచి అనుకోని పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారి పరిస్థితులు తలెత్తడంతో బకాయిలుగా వున్న మూడు వాయిదాల కరువు భత్యం విడుదల చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు.