బెంగళూరు భాజపా కార్యాలయం వద్ద పేలుడు !

Blast-outside-BJP-office-inబెంగళూరు భాజపా కార్యాలయం వద్ద ఈరోజు (బుధవారం) ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు గాయాలపాలవడంతో పాటుగా, పలు వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. భాజపా కార్యాలయం ముందు కారులో ఉన్న సిలిండర్ పేలినట్లు స్థానికులు తెలియజేశారు. అయితే పోలీసులు మాత్రం తనిఖీలు మొదలుపెట్టారు. జాగీలాలతో తనిఖీలు జరుపుతున్నారు. కారులో ఏమైనా బాంబులు పెట్టారా? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.