కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మోదీ జట్టులో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. 15మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసి పనిచేయడం ద్వారా బలమైన, సంపన్న భారత నిర్మాణానికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు, తాజా మార్పులతో మోదీ కేబినెట్లో మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
మంత్రులు శాఖల వారీగా,
నరేంద్ర మోదీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖను పర్యవేక్షించనున్నారు.
అమిత్ షా – హోంశాఖతో పాటు సహకార శాఖ
జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ
హర్దీప్ సింగ్ పూరీ – పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ
మన్సుఖ్ మాండవీయ – ఆరోగ్యశాఖ
అనురాగ్ఠాకూర్ – సమాచార, ప్రసారాలు; క్రీడలు
పీయూష్ గోయల్ – వాణిజ్య శాఖకు అదనంగా జౌళి శాఖ
అశ్వినీ వైష్ణవ్ – రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు
రాజ్ కుమార్ సింగ్ : పవర్ అండ్ మినిస్ట్రీ అఫ్ న్యూ అండ్ రెనవబుల్ ఎనర్జీ
ధర్మేంద్ర ప్రధాన్ : ఎడ్యుకేషన్ శాఖ
కిరెన్ రిజిజు : లా అండ్ జస్టిస్ శాఖ
పశుపతి కుమార్ పరస్ : ఫుడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ