ఈరోజుల్లో ఒక భార్య తోనే చాలామంది ఇబ్బంది పడుతూ పెళ్లి ఎందుకు చేసుకున్నాం అని బాధపడుతుంటే..హైదరాబాద్ లో ఓ వ్యక్తి ఇద్దరు భార్యలతో పడుతున్న ఇబ్బంది భరించలేక ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన వార్తల్లో నిలిచేలా చేసింది. ఆసిఫ్ నగర్ పీస్ పరిధిలోని భోజగుటలో నివాసం ఉంటున్న హరి అనే అతనికి ఇద్దరూ భార్యలు ఉన్నారు.
భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవ మొదలు కావడంతో ఇద్దరు భార్యల్లో ఒకరు హరి ఫోన్ గుంజుకున్నారు. దీంతో హరి మరో భార్యతో కలిసి అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడానికి వచ్చాడు. అయితే పోలీసులు హరితో మీరు ఎప్పుడు పడే గొడవనే కొద్దిసేపు ఓర్పుగా ఉండండి అని అన్నారు.ఆ మాటలకు మస్తాపం చెందిన హరి తనవెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.