హైదరాబాద్, పంజాగుట్ట పోలీసులు శుక్రవారం రాత్రి వ్యభిచార రాకెట్టును ఛేదించి ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్ట్ చేసారు. అక్కడ ఏడుగురు మహిళలను రక్షించి రెస్క్యూ హోమ్ కి తరలించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు సోమజిగుడలోని రాజ్ భవన్ రోడ్ లో ఒక హోటల్‌పై దాడి చేసి, నిర్వాహకులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్వాహకులు సోషల్ మీడియాలో యాడ్స్ పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవారని తెలిపారు. రక్షించిన అమ్మాయిలు వివిధ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. పోలీసులు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.