తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకు ఎక్కువై పోతుంది. ఎవరు కూడా తగ్గిదిలే అంటున్నారు. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదిలా ఉంటె ప్రస్తుతం ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లిపోయాయి. ఇటు తెలంగాణ పోలీసులు , అటు ఆంధ్ర పోలీసులు ప్రాజెక్ట్స్ వద్దకు చేరుకొని నువ్వా నేనా అన్నట్లు పహారి చేస్తున్నారు.
నాగార్జునసాగర్ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని మాట్లాడేందుకు వస్తున్న ఏపీ అధికారులకు నో ఎంట్రీ అంటున్నారు తెలంగాణ పోలీసులు…పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఆ ప్రాజెక్టు ఎస్.ఇ తెలంగాణ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. జూరాల డ్యాంపైకి తెలంగాణ రాకపోకలు నిలిపివేయగా, ఆర్డీఎస్ కుడికాలువ వద్ద ఏపీ.. పోలీసు బలగాలను మోహరించింది. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించగా, పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులను పెంచి ఆంధ్రప్రదేశ్ ఎవరినీ అనుమతించడం లేదు. ప్రస్తుతం జగన్ ఈ నీటి సమస్య ను కేంద్రానికి అప్పజెప్పారు. మీరే చూసుకోవాలని లేఖ రాసారు.