అమోజాన్, బ్లూ ఆరిజిన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్, తన తమ్ముడు మార్క్ తో కలిసి బ్లూ ఆరిజిన్ చేపట్టిన మొదటి అంతరిక్ష యాత్ర లో జులై 20 న పాల్గొననున్నాడు. న్యూ షెపర్డ్ అనే అంతరిక్ష నౌక లో ఆన్ లైన్ బిడ్డింగ్ లో సీటు కొనుక్కున్న ధనికులను అలా కాసేపు అంతరిక్షంలో తిప్పుకుని వస్తాడు. ఇది భవిష్యత్ లో రానున్న స్పేస్ టూరిజంకు అంకురార్పణ అవుతుందని జెఫ్ బెజోస్ అంటున్నాడు. బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ నౌకలో సీటుకోసం నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్ లో 20 కోట్ల రూపాయలకి ఆ నౌకలో సీటు కొనుక్కున్నాడు.
అయితే ఈ యాత్రపై అమెరికన్స్ మండిపడుతున్నారు. కరోనా టైమ్ లో ఎంతోమంది అమెరికన్ లు ఉద్యోగాలు కోల్పోయి నిరాశ్రయులు అయితే నువ్విలా కోట్లాది రూపాయలు స్పేస్ టూరిజం పేరుతో వృథా చేస్తావా అంటూ ఆన్ లైన్ ఓటింగ్ పెట్టారు. ఈ ఆన్ లైన్ ఓటింగ్ లో బెజోస్ నువ్వు అంతరిక్షంలోనే ఉండిపో, మళ్లీ భూమికి రాకు అంటూ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 33 వేలకు పైగా ఈ ఓటింగ్ లో పాల్గొని, బెజోస్ భూమికి రావొద్దని చెబుతున్నారు. మరికొందరు అంతరిక్ష యాత్ర కాదు నువ్వు సూర్యుడి దగ్గరకు యాత్ర చేయి అని, మరికొందరు ఆ స్పేస్ షిప్ ప్రయాణిస్తూ ఉండగా అందులోంచి దూకెయ్ అని ఇలా తమ కోపాన్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.