డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టాంజానియా వ్యక్తి (జాన్ విల్లియమ్స్) నుండి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు . అనంతరం అధికారులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ 20 కోట్ల విలువైన హెరాయిన్ గా తేల్చారు. పట్టుబడ్డ వ్యక్తి డ్రగ్స్ ని ట్రాలీ కిందిభాగంలో కనబడకుండా పెట్టి తీసుకెళ్లబోయాడు. అధికారులకి దోహా నుండి భారీ ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం రావడంతో దోహా నుండి వచ్చిన టాంజానియా వ్యక్తి దోహా నుండి రావడంతో అతని ట్రాలీ ని క్షణ్ణంగా వెతకగా 20 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది.