కామారెడ్డి జిల్లాలో వరాలు కురిపించిన సీఎం కేసీఆర్‌

సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని..100 శాతం కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కామారెడ్డిలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నాం. వచ్చే ఏడాది కామారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కూడా మంజూరు చేస్తాం. కామారెడ్డి జిల్లాలోని గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున కేటాయించాము. తెలంగాణలో కరెంట్‌ కొరత లేకుండా చేశాం. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌. కల్యాణలక్ష్మీ, రైతుబంధు వంటి పథకాలు పెట్టాం. పెన్షన్‌ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం అని అన్నారు.