కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రయాణాలకు తగిన రవాణా సౌకర్యాన్ని అందిచేందుకు, వలస కార్మికులు కావాల్సిన విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రైళ్లను అందుబాటులో ఉంచి.. వారిని తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు వీలుగా భారతీయ రైల్వే శాఖ రైళ్ల సంఖ్యను మరింత పెంచేలా చర్యలు చేపడుతోంది. వివిధ క్లస్టర్లలో ప్రయాణలకు గాను ఉన్న వెయిటింగ్ జాబితాను క్లియర్ చేయడానికి గాను భారత రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచుతోంది.
కోవిడ్‌కు ముందు సమయంలో రోజుకు సగటున 1768 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రజలకు సేవలనందించేవి. 18.06.2021 నాటికి, రోజుకు సుమారు 983 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇది ప్రీ-కోవిడ్ స్థాయిలో 56 శాతం మాత్రమే. డిమాండ్ మరియు వాణిజ్య సమర్థన ప్రకారం రైళ్ల సంఖ్య క్రమంగా పెంచుతూ వస్తోంది. 01.06.2021 నాటికి సుమారు 800 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. 01.06.2021 – 18.06.2021 మధ్య కాలంలో 660 అదనపు మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడానికి జోనల్ రైల్వేకు అనుమతి ఇవ్వబడింది.