కరోనా మందులు, వైద్య పరికరాలపై జీఎస్‌టీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

జీఎస్‌టీ మండలి 44వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనాపై పోరులో ఉపయోగించే ఔషధాలు, వైద్య పరికరాలు సహా ఇతర సామగ్రిపై పన్నులు తగ్గించారు. బ్లాక్ ఫంగస్‌ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపైనా పన్నులు కుదించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలి భేటీ అయ్యింది. భేటీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా నిర్ణయించిన ఈ పన్ను రేట్లు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటాయి.