కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారికి వడ్డీ సహా ఇతర ఆర్థిక ఉపశమన చర్యలు చేపట్టే బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. వడ్డీపై మారటోరియం విధించడం సహా ఇతర ఆర్థిక పరమైన నిర్ణయాలు విధానపరమైనవని, అందులో జోక్యం చేసుకోలేమని తెలిపింది.
కరోనా రెండో దశ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో రుణ గ్రహీతలు ఇబ్బందులు పడుతున్నారని.. వారినిఆదుకునేందుకు మళ్లీ మారటోరియం వంటి నిర్ణయాలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు పేర్కొంది.