వీడియో వైరల్ : బైక్ ని ట్యాంకుబండ్ లో విసిరేసిన కాంగ్రెస్ నేతలు

దేశంలో పెట్రోల్ రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. జులై 2020 నుండి ఈ రోజు వరకు పెట్రోల్ 25 రూపాయలు, డీజిల్ 24 రూపాయలు పెరిగింది, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ 100 దాటింది. హైద్రాబాద్ లో ఈ రోజు రూ. 99 .62 గా ఉంది, రేపో ఎల్లుండో ఇక్కడ కూడా 100 దాటిపోవడం ఖాయం. తెలంగాణ యూత్ కాంగ్రెస్, రేట్ల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేస్తూ బైక్ ని ట్యాంకుబండ్ లో విసిరేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషమీడియాలో వైరల్ అయింది. పలువురు కాంగ్రెస్ నేతలు ఈ నిరసనలో పాల్గొని వెంటనే కేంద్రం ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.