కోవిడ్ వాక్సినేషన్ కోసం కొత్త మార్గదర్శకాలు!

జాతీయ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం అమలుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఈరోజు సవరించిన మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాలు ఈనెల 21వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రాష్ట్రాల్లో 18 ఏళ్ల పైబడిన వారందరికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుందని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. జనాభా, వ్యాధి ప్రభావం వంటి అంశాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ డోసులు అందజేస్తారని ఈ సవరించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం వ్యాక్సిన్ అందుబాటు గురించి జిల్లాలు, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సమాచారం ఉండాలని కూడా ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు తమ ఉత్పత్తిలో 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అందజేయవచ్చని కూడా సూచించారు.