తెలంగాణ లో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు, సడలింపులు ఇలా …

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టుతుండడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పట్టాయి. తెలంగాణ లో మరో పది రోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ కాబినెట్ నిర్ణయం తీసుకుంది, అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఇంటికెళ్లడానికి మరొక గంట అంటే సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకే సడలింపు ఇచ్చారు. సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.

సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.