ఇకనుండి బ్యాంకు సెలవులతో సంబంధం లేకుండా జరగనున్న లావాదేవీలు

బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు ఉంటే జీతాలు, పెన్షన్ కోసం తర్వాత రోజు వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆగష్టు 1 నుండి బ్యాంకు సెలవులతో సంబంధం లేకుండా ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. ఇక వీటికి బ్యాంకు సెలవులతో ఎటువంటి సంబంధం లేదు. ఆగస్ట్ 1 నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ సేవలు బ్యాంకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.