లాక్‌డౌన్ల ఎత్తివేతపై రాష్ట్రాలకు సూచనలు చేసిన ఐసీఎంఆర్‌ చీఫ్‌

లాక్‌డౌన్ల ఎత్తివేత ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. కరోనా థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల ప్రణాళికను సూచించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు , కొవిడ్‌ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకొని లాక్‌డౌన్ల సడలింపులపై నిర్ణయం తీసుకోవాలన్నారు.