భారతీయ రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం మే నెలలోనే 114.8 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసి రికార్డు నెలకొల్పింది. తద్వారా రూ.11,604.94 కోట్ల ఆదాయం సంపాదించింది. 2019 మే లో అత్యధికంగా 104.6 టన్నుల సరకును రవాణా చేసిన రికార్డు ఇండియన్ రైల్వేకు ఉంది. దానికంటే 9.7శాతం అధికంగా రవాణా చేసి తాజాగా సరికొత్త రికార్డు సాధించింది. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
కేవలం మే నెలలోనే 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఉక్కు, 5.61 మిలియన్ టన్నుల ఆహారపదార్థాలు, 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల నూనెలు, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్, 4.2 మిలియన్ టన్నుల క్లింకర్ను రవాణా చేసినట్లు తెలిపింది.