సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు

కరోనా మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం​ ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు.