కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) రూపొందించిన 2-డీజీ ఔషధాన్ని గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ ఔషధాన్ని ఎలా వినియోగించాలో చెబుతూ నేడు మార్గదర్శకాలను విడుదల చేసింది.
2-డీజీ వినియోగానికి మార్గదర్శకాలివే..
. ఆసుపత్రిలో చికిత్స తీసుకునే కొవిడ్ రోగులకు అనుబంధ చికిత్సగా ఉపయోగించేందుకు 2-డీజీ ఔషధానికి అత్యవసర అనుమతి.
. మధ్యస్తం నుంచి తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కొవిడ్ రోగులకు సాధ్యమైనంత త్వరగా అంటే 10 రోజుల్లోపు వైద్యులు ఈ ఔషధాన్ని సూచించాలి.
. డయాబెటిస్, తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై ఈ ఔషధాన్ని ఇంకా పరీక్షించలేదు. అలాంటి వారి విషయంలో ముందుజాగ్రత్త అవసరం.
. గర్భిణీలు,పాలిచ్చే తల్లులు,18ఏళ్లు లోపు వారికి 2-డీజీ ఔషధాన్ని ఇవ్వకూడదు.