ఈ రోజు జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఉదయం నుండి ఆయన అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కరోనా నుండి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన తారక్ “నిండు మనసుతో నాకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, చిత్ర పరిశ్రమ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేసారు.