దేశంలో కామాంధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా, పోలీసులు ఎన్నికఠిన చర్యలు చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. మృగాళ్లు చివరికి కరోనా సోకిన రోగులను కూడా వదిలి పెట్టడం లేదు. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ కోవిడ్ సోకి ఐసీయూలో చికిత్స పొందుతోంది. 45 ఏళ్లు ఉన్న ఆ మహిళపై కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కరోనా బారిన పడిన ఆ మహిళ ఇటీవల చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తన తల్లిని కొందరు లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులతో కుమార్తె తెలిపింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.