తౌక్టే తుపాను : ఏపీ వర్ష సూచన

లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ‘తౌక్టే’ తుపానుగా రూపాంతరం చెందింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కి.మీ. దూరంలో ‘తౌక్టే’ కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది రాగల 6 గంటల్లో తీవ్ర, 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. మే 18న 2.30 నుంచి 8.30 గంటల మధ్య గుజరాత్‌ వద్ద ‘తౌక్టే’ తీరం దాటవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తౌక్టే తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపుల కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.