తమన్నా కొత్త వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ రిలీజ్ డేట్

november-story-tamannah-webseries-release-date

తమన్నా తాజాగా వరుసబెట్టి వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తానూ నటించిన వెబ్ సిరీస్ లెవెన్త్ హావర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంచి. ప్రస్తుతం తమన్నా ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరీస్ ఈ నెల 20 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తాను అనురాధ అనే అమ్మాయి పాత్రలో నటించానని, అది తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని తమన్నా చెప్పింది.

మరోవైపు తమన్నా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ తో కలిసి స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ చిత్రంలో, నితిన్ సరసన అందదున్ తెలుగు రీమేక్ మాస్ట్రో చిత్రంలో , ఎఫ్ 3 చిత్రంలో నటిస్తూ చేతినిండా సినిమాలతో బిజీ గా ఉంది.