కరోనా నుండి కోలుకున్న 110 ఏళ్ళ వృద్దుడు !

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 110 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తాజాగా స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించగా.. తాజాగా కోవిడ్ నెగెటీవ్ అని నిర్ధారణ అయ్యింది. రామానంద తీర్థులు కి ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఇది సాధ్యమైందని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజా రావు వెల్లడించారు. అయితే మరికొన్ని రోజులు పరిశీలనలో ఉంచుతామని తెలిపారు. ఆయనను సాధారణ వార్డుకు మారుస్తామని, పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆయనకు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పారు.