లాక్ డౌన్ ఎఫెక్ట్ : రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

తెలంగాణ‌లో ఈ రోజునుండి లాక్ డౌన్ అమలవుతుంది. నిన్న తెలంగాణ కాబినెట్ మీటింగ్ అనంతరం లాక్ డౌన్ ప్రకటన రాగానే మందు బాబులు వైన్ షాపులపై ఎగబడ్డారు. నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.125 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మకాలు జ‌రిగాయి. ఈరోజు ఏకంగా రూ.94 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. ఇక ఇదిలా ఉంటే, ఈనెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు రూ. 770 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు రాష్ట్ర అబ్కారీ శాఖ స్ప‌ష్టం చేసింది.