2021 ఏప్రిల్, 20వ తేదీ నుండి, భారత ప్రభుత్వం, వివిధ దేశాలు, సంస్థల నుండి అంతర్జాతీయ విరాళాలతో పాటు, కోవిడ్-19 సహాయ వైద్య సామాగ్రి, పరికరాలను అందుకుంటోంది.
2021 ఏప్రిల్, 27వ తేదీ నుండి 2021 మే, 8వ తేదీ వరకు మొత్తం, 6,738 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; 3,856 ఆక్సిజన్ సిలిండర్లు, 16 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 4,668 వెంటిలేటర్లు / బి-పి.ఎ.పి. లతో పాటు 3 లక్షల రెమెడిసివిర్ ఇంజెక్షన్లను పంపిణీ చేయడం జరిగింది.
కెనడా, థాయిలాండ్, నెదర్లాండ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, అమెరికా, జపాన్, మలేషియా, అమెరికా (గిలేడ్), అమెరికా (సేల్స్-ఫోర్స్ ), థాయ్లాండ్ లోని భారతీయ సమాజం నుండి 2021 మే, 8వ తేదీన అందుకున్న ప్రధాన వస్తువులు:
. ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్లు (2,404)
. రెంమ్డేసివిర్ (25,000)
. వెంటిలేటర్లు (218)
. పరీక్షా పరికరాలు (6,92,208)