దేశంలో కరోనా రెండవ దశ విజృంభిస్తుంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ విధించాయి, మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. కరోనా సేఫ్టీ పికాషన్స్ లో భాగంగా కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే గర్భిణి ఉద్యోగులు, దివ్యాంగులైన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పిస్తూ కేంద్రప్రభత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇతరులైన 50% ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరవ్వాలని, ఈ నిబంధనలు మే 31వ తేదీవరకు అమల్లో ఉంటాయని తెలిపింది.