జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ వివాదం… అసలు నిజం ఏంటంటే ?

రాష్ట్రం లో ప్రముఖులంతా ఎక్కడ నివసిస్తారు అంటే టక్కున వచ్చే సమాధానం జూబ్లీహిల్స్ .. మరి ఇంత ప్రాధాన్యం ఉన్న జూబ్లీహిల్స్ కు ఒక హోసింగ్ సొసైటీ ఉంది.. .మొన్న మార్చ్ లో జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి .. ఇదేదో ఎమ్మెల్యే ఎన్నికల స్థాయి లో హడావుడి జరిగింది ..ఒక వర్గం వారైతే ఏకంగా ఐదు వేలమందిని తీసుకువచ్చి వాళ్ళ ప్రచారం తో పోలింగ్ రోజు హడావుడి చేశారు ఇదంతా చూసిన పెద్దలు కొందరు ముక్కున వేలేసుకున్నారు ..

ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం విజయం సాధించి పదవులను చేపట్టింది, ఇక అక్కడ మొదలయ్యింది అసలు కథ ..ఇచ్చిన హామీల విషయం పక్కన పెట్టి గత పాలకవర్గం అక్రమాలు అంటూ ఒక కేసు పెట్టి .. నిజా నిజాలు తేలకుండానే వాట్సాప్ లో ప్రచారం మొదలెట్టారు .. దీనికి ఒక ఛానల్ వారు  యధాశక్తి పనిచేసారు …విషయం కోర్ట్ కు వెళ్ళింది ,ఇందులో గత పాలకవర్గం చేసింది ఏమి లేదని గతం లో 2007 ,2011 లో  ఇచ్చిన కోర్టు తీర్పు ఆధారంగానే  ఆ రిజిస్ట్రేషన్ జరిగిందని, కోర్టు తేల్చి తదుపరి ప్రొసీడింగ్స్ ను నిలిపివేసింది..

నిజానికి ఈ ప్రచారాల వెనుక పెద్ద కుట్ర  ఉందని చౌదరి సన్నిహితులు ఆరోపిస్తున్నారు.. కేసు కోర్ట్ లో ఉన్నప్పుడు పోలీస్ fir కాపీ పట్టుకొని వాట్స్ అప్ లో సోషల్ మీడియా లోntv  చౌదరి మీద పోలీస్ కేసు అంటూ ప్రచారం చెయ్యడం కేవలం ఆయన పాపులారిటీ ని దెబ్బతీయడానికేనని చౌదరి వర్గీయుల ఆరోపణ.. ఇది ఇక్కడితో ఆగకుండా భక్తి టీవీ మీద బురద చల్లడం వాళ్ళ అరాచకానికి పరాకాష్ట అని వారు అంటున్నారు .. కోటిదీపోత్సవం కార్యక్రమం తో చౌదరి మంచి పేరు సంపాదించారు అది ఓర్చుకోలేనివారు ఈ కుట్రకు తెరలేపారని సొసైటీ సభ్యులే అనుకుంటున్నారు ..

అయినా జూబ్లీహిల్స్ లో అన్నిరంగాల ప్రముఖులు ఉంటారు  మరి అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకుంటారా ? గతం లో చౌదరి కొన్ని మంచి పనులే చేసారు .. ప్రభుత్య సహాయం తో  రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు,  జూబ్లీహిల్స్ సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు పెట్టించడం.. nri  సభ్యుల స్థలాలను కాపాడడం లో వారికి సహాయం చెయ్యడం .. పార్కులు ,విద్యాసంస్థల అభివృద్ధికి సహకరించారు.మంచి పేరున్న చౌదరి ని అప్రదిష్ట పాలు చెయ్యడానికి కొందరు పనికట్టుకొని ఇలా సోషల్ మీడియా లో ప్రచారానికి తెరలేపారని కొందరు సభ్యుల ఆరోపణ .. మరి చౌదరి ఏం చేస్తున్నారు .. ఇవన్నీ పక్కకు పెట్టి వనిత ఛానల్ ఎంటెర్టైన్మెట్ ఛానల్ గా, అదేవిధంగా భక్తి OTT తెచ్చే  పనిలో ఆయన బిజీ ఉన్నారని..కేసుల గురించి పట్టించుకోవడం లేదంటున్నారు ఆయన సన్నిహితులు .  మరి రెండు ఛానల్ ల మధ్యలో జరిగే గొడవలో ఒక వర్గం వారి మాటవిని నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా లో ఈ వార్తలు షేర్ చేసే వారి పరిస్థితి ఏమిటో ..