తెలంగాణ లో ఈ రోజు నుంచి యథావిధిగా టీకాల పంపిణీ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. నిన్న రాష్ట్రానికి 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. మరో 50 వేల కొవాగ్జిన్ డోసులు ఈరోజు రానున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.
కొవిషీల్డ్ తొలిడోసు తీసుకున్నతర్వాత 6-8 వారాల మధ్య ఎప్పుడైనా రెండో డోసు తీసుకోవచ్చని, కొవాగ్జిన్టీకా తొలిడోసు తీసుకున్న తర్వాత 4-6వారాల మధ్య రెండోడోసు స్వీకరించవలసిఉంటుందని రెండోడోసు తప్పనిసరిగా తీసుకుంటేనే యాంటీబాడీలు వృద్ధిచెంది కోవిడ్ నుంచి పూర్తిరక్షణ లభిస్తుందని వివరించారు.