దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, రోజురోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా నియంత్రణకు ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు లొక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తుండగా తాజాగా మరో రాష్ట్రం లాక్డౌన్ జాబితాలో చేరింది. బీహార్ లో తాజాగా లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచి మే 15 వ తేదీ వరకూ లాక్డౌన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం బీహార్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 24 గంటల్లో బీహార్లో 11 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.