దేవిశ్రీ కుమ్మేశాడ‌ట‌…

dspఅల్లు అర్జున్ – దేవిశ్రీ ప్రాసాద్ క‌లయిక అంటే ఇక అల్టిమేట్ అనాల్సిందే. ఆర్య నుంచి జులాయి వ‌ర‌కూ వీరిద్దరి కాంబినేష‌న్ ఓ ఊపు ఊపేసింది. ఇద్దర‌మ్మాయిల‌తో సినిమాలోనూ అందుకు ఏమాత్రం త‌గ్గకుండా పాట‌లుంటాయ‌ట‌. వెస్ట్రన్, మెలోడీ, ఫాస్ట్‌బీట్‌… ఇలా దేనికీ లోటు చేయ‌కుండా దేవిశ్రీ ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడ‌ట‌. అయితే ఒక‌టే.. లోపం. ఐటెమ్ పాట లేదంతే. పాట‌ల విష‌యంలో పూరి చాలా కేర్ తీసుకొన్నాడ‌ట‌. స్టెప్పులు కూడా బ‌న్నీ రేంజులోనే ఉంటాయ‌ని స‌మాచారం. ఈ సినిమాలోని పాట‌ల్ని ఈనెల 21న విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది..