భారత్ బయోటెక్ సిఎండి తో సమావేశమైన తెలంగాణ సిఎస్

వయోపరిమితి లేకుండా ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సిఎండి శ్రీ క్రిష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నేడు సమావేశమయ్యారు. సమగ్ర కోవిడ్ వ్యాక్సినేషన్ కు సరిపోను డోసులను సరఫరా చేయాలని సిఎండి ని సీఎస్ కోరారు. అత్యధిక వ్యాక్సిన్లు ఇవ్వటానికి సంస్థ సానుకూలంగా స్పందించిందని తెలిపారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డా. సాయి ప్రసాద్ లు సమావేశంలో పాల్గొన్నారు.