నెగిటివ్ ప్రచారం క‌లిసొస్తుందా?

Gouravamఅల్లు శిరీష్ త‌న కుటుంబ `గౌర‌వం` నిల‌బెట్టడానికి ఈ శుక్రవారం బాక్సాఫీసు ముందుకు వ‌స్తున్నాడు. గ‌త రెండు మూడు రోజుల నుంచీ ఈ సినిమా కొసం భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. నిజానికి.. ఇది త‌క్కువే. అల్లు అర్జున్ తమ్ముడు, అల్లు అర‌వింద్ త‌న‌యుడు… అల్లు రామ‌లింగ‌య్య మ‌న‌వ‌డి సినిమా ఎంట్రీ అంటే ఏ రేంజులో ఉండాలి? అయితే అవేమీ ఈ గౌర‌వం సినిమాకి క‌నిపించ‌డం లేదు. ఈ సినిమాపై ఎవ‌రికీ న‌మ్మకాలు లేక‌పోవ‌డంతో ప‌బ్లిసిటీపై దృష్టిసారించ‌డం లేదు. త‌మిళంలో ప్రకాష్‌రాజ్ సినిమాల‌కున్న గుడ్ విల్‌, రాధామోహ‌న్ ట్రాక్ రికార్డ్ కాస్తో కూస్తో వ‌సూళ్లు తెచ్చిపెడ‌తాయి. ఇక్కడ అంత సీన్ లేదు. అల్లు శిరిష్ బొమ్మ ఇంకా ఎవ‌రి ఫ్రేమ్‌లోనూ రిజిస్టర్ కాలేదు. అందుకే బ‌న్నీని ప్రమోష‌న్ లోకి దించుతున్నాడు శిరీష్‌. ఈ అన్నద‌మ్ములిద్దరూ క‌లిసి మీడియాకి ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తున్నారు. క‌నీసం అలాగైనా ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని ఆశ‌. ఈ నెగిటివ్ ప్రచారం కూడా సినిమాకి క‌లిసొచ్చే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే ఎటువంటి.. అంచ‌నాలూ లేకుండా సినిమాకి వెళ్తారు. కాస్త బాగున్నా ప్లస్సే క‌దా??