దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. రోజు వారి కేసుల సంఖ్య 3 లక్షలు దాటుతున్న తరుణంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తాజాగా కేసులు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10 గంటల తర్వాత షాపులు మూసివేయబడి ఉంటాయని తెలిపింది.
లాక్ డౌన్ రోజుల్లో వ్యవసాయ రంగాలు, నిర్మాణ రంగాలు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.