ఎన్నో మధుర జ్ఞాపకాలతో పదవీ విరమణ చేస్తున్నా అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అన్నారు. 22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన శుక్రవారం సీజేఐగా పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్గా నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టులో పనిచేసినందుకు సంతృప్తిగా ఉందని చెప్పారు. తదుపరి సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ సమర్థంగా నాయకత్వ బాధ్యతలు నిర్వహించగలరని అన్నారు. కరోనా సమయంలోనూ కోర్టు విచారణలు ఎక్కడా ఆపలేదని జస్టిస్ బోబ్డే ఈ సందర్భంగా గుర్తు చేశారు.