జిహెచ్ఎంసి లో ముమ్మరంగా కొనసాగుతున్న చెత్త తొలగింపు

 రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాలతో చేపట్టిన ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా రెండోరోజైన నేడు పెద్ద ఎత్తున చెత్త తొలగింపు డ్రైవ్ కొనసాగింది. బిన్ లెస్ ఫ్రీగా చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని గార్బేజ్ పాయింట్ల నుండి రెండు నుండి మూడు సార్లు చెత్తను జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. చెత్తను తొలగించిన ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా ఉండేందుకు అందమైన ముగ్గులను కూడా పారిశుధ్య కార్మికులు వేస్తున్నారు. త్వరితగతిన చెత్తను టిప్పర్ లో వేసేవిధంగా స్వీపింగ్ సందర్భంలో చెత్తను ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి సమీపంలోని గార్బేజ్ పాయింట్ల వద్ద ఉంచాలని పారిశుధ్య కార్మికులకు ఆదేశాలు జారీచేశారు. దీనితో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాగా ఈ ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను జిహెచ్ఎంసి జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లు నేడు ఉదయం నుండే పర్యవేక్షించారు.